‘హనుమాన్’ చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జా నుంచి వచ్చిన తాజా చిత్రం ‘ మిరాయ్ ’. కార్తీక్ ఘట్టమనేని దర్వకత్వం వహించిన ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించారు. టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తేజ యాక్టింగ్ మెచ్యూర్డ్‌గా ఉందని, విజువల్స్ అదిరిపోయాయని, ప్రభాస్ ఎంట్రీ గూస్‌బంప్స్ తెప్పిస్తోందని చూసినవారు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చాలా సినిమాలు గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కోగా తక్కువ బడ్జెట్‌లోనే ‘మిరాయ్’ మేకర్స్ అద్బుతమైన ఔట్‌పుట్ ఇచ్చారని అంటున్నారు. ‘మిరాయ్’ సినిమాతో తేజ బంపరాఫర్ కొట్టాడని, అతడి స్టోరీ సెలక్షన్స్ అద్భుతమని ప్రేక్షకులు కొనియాడుతున్నారు.
‘మిరాయ్’ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. బ్లాక్‌బస్టర్ మిస్ అయ్యాడే!
Published on: 12-09-2025