తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిరాయ్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే బుకింగ్స్ జరిగాయి. అయితే మరికొన్ని గంటల్లో షోలు పడబోతున్నాయనగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ‘మిరాయ్’ సినిమాలో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని, అవేంటనేది ఎవరికీ తెలియదని హీరో తేజ సజ్జా ఇటీవల వైజాగ్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా ప్రకటించారు.