ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ మంచి మనసు గురించి చెప్పాల్సిన పనిలేదు. ‘రాఘవ లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతో మందికి తనవంతు సాయం చేశారు. ఆపదలో ఉన్నవారికి ఆపద్భాంధవుడిగా నిలిచారు. ఎవరూ లేని అనాథ పిల్లలకు పెద్ద దిక్కయ్యారు. వృద్ధాశ్రయాలు, అనాథశ్రమాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి నీడనిస్తున్నారు. దైవం మనూష్య రూపేణా అనేదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన లారెన్స్.. మరోసారి ఉదారత చాటారు. రాఘవ లారెన్స్ తన సొంతింటిని ఫ్రీ స్కూల్ గా మారుస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపారు.
రాఘవ లారెన్స్ గొప్ప మనసు.. తన ఇంటిని ఉచిత పాఠశాలగా మారుస్తున్నట్లు ప్రకటన..
Published on: 12-09-2025