'హనుమాన్' సినిమాతో సంచలన విజయం అందుకున్న యువ హీరో తేజ సజ్జా.. చాలా టైం తీసుకొని ఇప్పుడు 'మిరాయ్' మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. రేపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుండగా.. హీరో తేజ సజ్జా మీడియా సమావేశంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు.
మిరాయ్ విడుదల.. పార్ట్ 2 ఉంది.. రెండు బిగ్ సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి: తేజా సజ్జా
Published on: 12-09-2025