దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025లో భారత్ - యూఏఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. యూఏఈ బ్యాటర్ ఔటైనప్పటికీ, బౌలర్ టవల్ వల్ల డిస్ట్రాక్ట్ అయ్యానన్న అతని వాదనతో సూర్యకుమార్ అప్పీల్ వెనక్కి తీసుకున్నాడు. అయితే, యూఏఈ ఈ మ్యాచ్‌లో 57 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సూర్యకుమార్ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంది.
సూర్యకుమార్ యాదవ్ గొప్ప మనస్సు.. యూఏఈ బ్యాటర్ అవుటైనా క్రీడా స్ఫూర్తి చాటిన స్కై!
Published on: 11-09-2025