కొణిదెల వారి ఇంట వారసుడు జన్మించాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మనవడిని ఎత్తుకుని మురిసిపోయిన చిరంజీవి.. కొణిదెల ఫ్యామిలీలోకి చిన్నారికి స్వాగతం పలుకుతూ ఆశీర్వదించారు. నాగబాబు, పద్మజలు తాతయ్య - నానమ్మలుగా మారారంటూ సంతోషం వ్యక్తం చేశారు. మెగా వారసుడిని ఎత్తుకొని ఉన్న ఓ ఫోటోని చిరు సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెగా ఫ్యామిలీకి వారసుడు కావాలంటూ ఆ మధ్య చిరంజీవి బహిరంగంగా చెప్పిన నేపథ్యంలో, మెగాస్టార్ కోరిక నెరవేరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Chiranjeevi: చిరు కళ్లలో ఆనందం.. వారసుడు కావాలనే కోరిక నెరవేరిన వేళ.. మనవడిని ఎత్తుకొని మురిసిపోతున్న మెగాస్టార్
Published on: 11-09-2025