రవితేజ కథానాయకుడిగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కార్మికుల సమ్మె కారణంగా వాయిదా పడుతుందని ప్రచారం జరిగినా జనవరి 13న విడుదల ఖరారైనట్లు సమాచారం. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబరు చివరినాటికి పూర్తి కానుంది. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రానికి ‘అనార్కలి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరోవైపు రవితేజ నటించిన మాస్ జాతర నిర్మాణానంతర పనుల్లో ఉండగా, అక్టోబరు లేదా నవంబరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.