వరుస సినిమాలతో దూసుకుపోతున్న తేజ సజ్జా తాజాగా ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తేజ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఒక ప్రముఖ దర్శకుడు కథ చెప్పడంతో 15 రోజులపాటు షూటింగ్ చేశానని, కానీ తన స్థానంలో మరో హీరోని తీసుకోవడంతో షాక్ అయ్యానని వెల్లడించాడు. తాను మాక్ షూటింగ్ కోసం మాత్రమే తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందన్నారు.
ఆ పెద్ద డైరెక్టర్ నన్ను 15 రోజులు వాడుకుని వదిలేశాడు - తేజ షాకింగ్ కామెంట్స్
Published on: 08-09-2025