Nara Lokesh On Kopparthi 1 Lakh Jobs: మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించి కొప్పర్తి పారిశ్రామిక పార్కులో రూ.121 కోట్ల పెట్టుబడితో టెక్నోడోమ్ ఎల్ఈడీ టీవీ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. దీని ద్వారా 300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అంతేకాకుండా, టెక్సానా మాన్యుఫ్యాక్చరింగ్ నూతన యూనిట్‌ను ప్రారంభించి, రూ.50 కోట్ల పెట్టుబడితో 2,100 మందికి ఉపాధి కల్పించనున్నారు. కొప్పర్తి పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసి లక్ష ఉద్యోగాలు సృష్టిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు