రంగస్థలం’లో

రంగస్థలం’లో నేనే చేయాల్సింది.. దానివల్ల 6 నెలలు అవకాశాలు రాలేదు

Published on: 03-09-2025

తెలుగులో మంచి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్, తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి సినిమాతో రానుంది. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. రంగస్థలం సినిమాలో సమంతకు ముందుగా తనను అప్రోచ్ చేశారని, తాను చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ చివరికి వేరే హీరోయిన్‌ను తీసుకున్నారని వెల్లడించింది. కానీ మీడియా మాత్రం “అనుపమనే కావాలని రిజెక్ట్ చేసింది” అని రాసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

Sponsored