హరియాణాకి చెందిన మీనాక్షి చౌదరి అందాల పోటీల్లో మెరిసి తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్‌స్టార్ట్స్ అనే హిందీ సినిమాతో పరిచయమైన మీనాక్షికి తెలుగులో మంచి అవకాశాలు దక్కాయి. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే రవితేజ పక్కన ఖిలాడీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. కానీ హిట్ 2తోనే మీనాక్షికి హిట్ దక్కింది. ప్రస్తుతం తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది.