ఇటీవల థియేటర్లలో విడుదలైన మలయాళ చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర (తెలుగులో కొత్త లోక) బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. అయితే క్లైమాక్స్‌లో బెంగళూరుకు చెందిన అమ్మాయిలపై అవమానకరంగా ఉన్న డైలాగ్, అలాగే దగర్ అనే పదం వాడటంతో కన్నడ ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. ఈ వివాదం పెరగడంతో నిర్మాత దుల్కర్ సల్మాన్ తాజాగా క్షమాపణలు తెలిపారు.
‘లోక చాప్టర్ 1’ వివాదం.. కర్ణాటక ప్రజలకు దుల్కర్ సల్మాన్ క్షమాపణలు
Published on: 03-09-2025