అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. అయితే సెన్సార్ బోర్డు సుమారు 9 సీన్లపై అభ్యంతరం తెలిపింది. హింస్మాతక సీన్స్, అభ్యంతరకర పదాలను తొలగించి, కొన్ని చోట్ల రీప్లేస్ చేయాలని సూచించింది. ముఖ్యంగా అనుష్క మెడ కోసే సీన్, స్కూల్ పిల్లలు గంజాయి వాడుతున్న సన్నివేశం, పదే పదే కత్తిపోట్లు చూపిన విజువల్స్‌ను రీప్లేస్ చేశారు.