ప్రజల ఆస్తి, ప్రాణాలు కాపాడటం కోసం పోలీసు డిపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన ఓ వ్యక్తి దొంగగా మారాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతడు, తన బావమరిది నాగసాయితో కలిసి దొంగతనాలకు పాల్పడసాగాడు. తాజాగా సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రియాంక అనే యువతి ఐఫోన్ 15 దొంగతనానికి గురవడంతో.. ఈ దొంగ కానిస్టేబుల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇతడిని రిమాండ్‌కు తరలించారు.