GAMA Awards 2025: దుబాయ్ వేదికగా జరగనున్న 'గామా' అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. ఐదవ ఎడిషన్ ఆగస్టు 30న షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్ జ్యూరీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. 2024లో విడుదలైన చిత్రాలకు 24 క్రాఫ్ట్స్ విభాగాల్లో పురస్కారాలు అందజేయనున్నారు.
GAMA Awards 2025: అవార్డ్స్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి.. 'గామా' ఈవెంట్‌లో ఎ.కోదండరామిరెడ్డి
Published on: 26-08-2025