అందాల తార మృణాల్ ఠాకూర్ తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హిందీతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో కూడా తన కెరీర్ను సమతుల్యం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, భాష కంటే కథలోని భావోద్వేగాలే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
తన కెరీర్ ప్రారంభ దశలో అనేక ప్రణాళికలు పెట్టుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోయాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు ఉత్తరాది, దక్షిణాది సినిమాల్లో అవకాశాలు పొందుతూ ముందుకు సాగుతున్నానన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టాలని ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంచి కథల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.
బాలీవుడ్లో తన తొలి రోజులు సవాళ్లతో నిండినవని మృణాల్ వెల్లడించారు. అవకాశాలు సులభంగా రాలేదని, వాటిని స్వయంగా వెతుక్కోవాల్సి వచ్చిందన్నారు. దర్శకులను సంప్రదిస్తూ, తనకు తానుగా అవకాశాలను సృష్టించుకోవడం నేర్చుకున్నానని చెప్పారు. నటనపై ఉన్న ప్రేమతో ఎలాంటి సంకోచం లేకుండా ముందడుగు వేసానన్నారు.
ప్రస్తుతం డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నానని, మరోవైపు కొన్ని పెద్ద ప్రాజెక్టులపై కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అల్లు అర్జున్ నటన తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో కలిసి పనిచేయాలనే ఆసక్తి ఉందన్నారు.
భవిష్యత్తులో వివిధ భాషల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించాలని మృణాల్ ఠాకూర్ ఆశిస్తున్నారు.