11 indians arrested in us over alleged fake robbery uvisa fraud

యూ-వీసా కోసం నకిలీ దోపిడీల డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్

4

Published on: 📅 14 Mar 2026, 11:35 AM
Reporter: 🖊 Ramesh Kumar

అమెరికాలో యూ-వీసా పొందేందుకు నకిలీ దోపిడీల డ్రామాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 11 మంది భారతీయులు అరెస్టయ్యారు. దోపిడీ బాధితులమని చూపించి చట్టబద్ధంగా ఉండే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు పొందాలని వీరు ప్రయత్నించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. మసాచుసెట్స్ కేంద్రంగా సాగిన ఈ మోసం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించినట్టు దర్యాప్తులో బయటపడింది. అసలు నేర బాధితుల కోసం ఉన్న యూ-వీసా వ్యవస్థనే దుర్వినియోగం చేసిన ఈ కేసు ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చకు దారితీసింది.

Sponsored