ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆయన్ను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను సభలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు. జీరో టికెట్ పథకానికి పూర్తి నిధులు ఇవ్వకపోవడం వల్ల సంస్థ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై హరీశ్‌రావు
9