నటి రష్మిక మందన్నపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొన్ని కన్నడ మీడియా, ఇన్ఫ్లూయెన్సర్లు తాను మాట్లాడని మాటలతో కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల తనపై దుష్ప్రచారం పెరిగిందని, వ్యక్తిగత గోప్యతను కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. తప్పుడు కథనాలను వెంటనే తొలగించాలని 24 గంటల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. లేకపోతే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
తప్పుడు ప్రచారంపై రష్మిక ఆగ్రహం
5
Published on: 📅 12 Mar 2026, 06:49 PM
Reporter: 🖊 Anitha Sharma