ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. కలెక్టర్లతో జరిగిన భేటీలో వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆదేశించారు. దీంతో పథకాల అమలు పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. పింఛన్, ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల వివరాలు లబ్ధిదారులకు చేరాలని సూచించారు. దీపం 2.0కు డిజిటల్ వోచర్ జారీ అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. మహిళలు ఇప్పటికే కోట్ల సంఖ్యలో ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు.
త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల
10
Published on: 📅 12 Mar 2026, 05:00 PM
Reporter: 🖊 Suresh Reddy