పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. మొత్తం 46.80 లక్షల మంది రైతులకు రూ.2,808 కోట్లను విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.4,000 కలిపి ఒక్కో రైతుకు రూ.6,000 జమ కానుంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేశారు.
రైతుల ఖాతాల్లో ₹6వేలు జమ
3
Published on: 📅 11 Mar 2026, 12:27 PM
Reporter: 🖊 Ramesh Kumar