first phase of census to begin from may 1

మే 1 నుంచి జనగణన తొలి దశ

5

Published on: 📅 11 Mar 2026, 12:26 PM
Reporter: 🖊 Anitha Sharma

2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ చేపడుతున్నట్లు సెన్సస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ సీఎం చంద్రబాబుకు వివరించారు. జనాభా లెక్కల ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. తొలి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన మే 1 నుంచి 30 వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పిస్తారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కింపు ప్రారంభమవుతుంది.

Sponsored