no minimum balance for pmjdy bank accounts

జన్ ధన్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ లేదు

1

Published on: 📅 10 Mar 2026, 04:04 PM
Reporter: 🖊 Ramesh Kumar

ప్రధానమంత్రి జనధన్ యోజనతో పాటు దేశంలో ఉన్న 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు కనీస నిల్వ నిబంధన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఎలాంటి జరిమానా ఉండదని స్పష్టం చేశారు. డిపాజిట్, విత్‌డ్రా, ఏటీఎం సేవలకు కూడా ఛార్జీలు ఉండవని చెప్పారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సదుపాయం కల్పించామని వెల్లడించారు. ఈ విషయాన్ని లోక్‌సభలో రాతపూర్వక సమాధానంగా తెలిపారు.

Sponsored