iran warns of blocking oil through hormuz

ఆయిల్‌పై ఇరాన్ హెచ్చరికలు

3

Published on: 📅 10 Mar 2026, 04:00 PM
Reporter: 🖊 Kiran Rao

ఆయిల్ సరఫరా నిలిపేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించగా ఇరాన్ ఘాటుగా స్పందించింది. హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క లీటర్ ఆయిల్ కూడా వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగితే శత్రు దేశాల ఆయిల్ సరఫరాను పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించింది. యూఏఈ, సౌదీ, ఖతర్ వంటి అమెరికా మిలిటరీ బేస్‌లు ఉన్న దేశాలను కూడా అప్రమత్తం చేసింది. ఇప్పటికే పెరిగిన ఆయిల్ ధరలతో ఆందోళనలో ఉన్న దేశాలకు ఈ హెచ్చరికలు మరింత కలవరపరుస్తున్నాయి.

Sponsored