cbi issues fresh notice to vijay in karur stampede case

విజయ్‌కు సీబీఐ మరో నోటీసు

6

Published on: 📅 09 Mar 2026, 03:22 PM
Reporter: 🖊 Kiran Rao

కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో టీవీకే చీఫ్ విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 12, 19 తేదీల్లో సీబీఐ ఇప్పటికే విజయ్‌ను విచారించింది. తాజా నోటీసుతో ఆయన మరోసారి విచారణకు హాజరుకానున్నారు.

Sponsored