టీ20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతా, ముంబైలో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచులను విదేశాలకు మార్చే అవకాశం తక్కువగా ఉన్నట్లు సమాచారం. బదులుగా కోల్‌కతా, ముంబైలో జరగాల్సిన మ్యాచులను చెన్నై, తిరువనంతపురంలో నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.