మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు మెరుగైన సేవల అందింపుపై సీఎం సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలనా సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. జీఎస్డీపీ వృద్ధి, ఆర్టీజీఎస్ అమలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పురోగతిపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా హాజరై తమ జిల్లాల పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు.