బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 20 రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కొందరు యువకుడిని విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. అనంతరం అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని ఆరోపించారు. గురువారం దాడి జరగగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతుడిని జై మహాపాత్రగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారులు విచారణ ప్రారంభించారు.