సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్–విజయవాడ హైవేపై ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేశామని చెప్పారు. పంతంగి టోల్ గేట్ వద్ద స్వల్ప రద్దీ మాత్రమే ఉందన్నారు. విజయవాడ హైవేపై ఆరు వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని, నేషనల్ హైవే డైరెక్టర్‌తో చర్చించి యంత్రాలు తొలగించామని తెలిపారు. ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు భద్రత చర్యలు మరింత బలోపేతం చేశామని స్పష్టం చేశారు.