సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో జిల్లావ్యాప్తంగా కోడిపందాల బరుల సందడి ఊపందుకుంది. గ్రామాలు, పట్టణాల పరిసరాల్లోని పొలాలు, ఖాళీ లేఅవుట్లను చదును చేసి పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేసి భారీ గ్యాలరీలను నిర్మిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలు కూడా సిద్ధం చేస్తున్నారు. పందేల సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రైవేట్ బౌన్సర్లను నియమిస్తున్నారు. పండుగకు ముందే పందెం రాయుళ్ల హడావుడితో గ్రామాలన్నీ పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి.