సంక్రాంతికి

సంక్రాంతికి విమాన టికెట్ల ధరల షాక్

Published on: 12-01-2026

సంక్రాంతి పండగ వేళ ఊరెళ్లే ప్రయాణికులకు విమాన ఛార్జీలు షాక్ ఇస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వెళ్లేందుకు రూ.3 వేలకే లభించే టికెట్లు 12, 13 తేదీల్లో రూ.12 వేల వరకు పెరిగాయి. మళ్లీ 17, 18 తేదీల్లో ఏపీ నుంచి హైదరాబాద్ రావాలన్నా ఇదే పరిస్థితి. విశాఖ వెళ్లే టికెట్ ధర సగటున రూ.14 వేల వరకు ఉండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sponsored