రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈనెల 2 నుంచి 9 వరకు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించినా అలసత్వం వహించిన తొండూరు MROను సస్పెండ్ చేశారు. చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CKదిన్నే MROలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైతుల సమస్యలపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టంగా ఆదేశించారు.