టీ20 ప్రపంచకప్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచకప్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం తరఫున ఆడే ప్రతి ఆటగాడు తన శక్తిమేర ఉత్తమంగా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాడని అన్నారు. జట్టును ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా సెలక్టర్లదేనని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఉండాల్సిన చోటే ఉన్నానని, తన గమ్యం ఎలా నిర్ణయించబడితే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.