ప్రభాస్–మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ సినిమా తొలి రోజే బాక్సాఫీస్‌ను దద్దరిల్లించింది. ఫస్ట్‌డే వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. హారర్ ఫాంటసీ కేటగిరీలో ఇదే అత్యధిక ఓపెనింగ్‌గా నిలిచిందని ట్వీట్ చేసింది. ప్రభాస్ స్టార్డమ్ మరోసారి నిరూపితమైందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండగా, తొలి రోజు వసూళ్లు వాటిని మించి ఆశ్చర్యపరిచాయని విశ్లేషకులు తెలిపారు. అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ షోలతో సినిమా జోరుగా నడుస్తుండగా, అభిమానుల్లో సంబరాలు వెల్లువెత్తుతున్నాయి