అమరావతిని YCP చీఫ్ జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై చర్చ జరగడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజధానిలోనే జగన్ ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని చెప్పారు. పాలనా వికేంద్రీకరణలోనూ అమరావతిని తక్కువ చేయలేదన్నారు. చంద్రబాబు అక్రమ నివాసంపై వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజధాని రైతుల ఆందోళనలను గౌరవిస్తామని అన్నారు. ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తామని చెప్పారు.