స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరిగే T20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయనకు శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. కోలుకోవడానికి 3–4 వారాలు పడుతుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 7న జరిగే T20 వరల్డ్ కప్ నాటికి ఫిట్ అవుతాడా అనే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి.