YCP అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నట్లు పార్టీ తెలిపింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అంశం, ప్రభుత్వ తాజా నిర్ణయాలు, ప్రజా సమస్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.