వచ్చే నెల భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న T20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఫిన్ అలెన్, కాన్వే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర వంటి స్టార్‌లు జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఈ నెల 11 నుంచి భారత్‌తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌కు రానుంది.