విజయ్ హజారే ట్రోఫీ (VHT)లో కర్ణాటక ఓపెనర్ దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. మూడు వేర్వేరు సీజన్లలో 600కుపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించారు. సచిన్, కోహ్లీ, రోహిత్‌లకూ ఈ ఘనత సాధ్యం కాలేదు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 91 రన్స్ వద్ద ఔటై ఐదో సెంచరీ అవకాశాన్ని కోల్పోయారు. లిస్ట్-Aలో 83.62 సగటుతో పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆయన ప్రదర్శనతో కర్ణాటక క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.