‘ఆవకాయ-అమరావతి’ పేరుతో విజయవాడలో మరో ఉత్సవం జరగనుంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో రేపట్నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. 8వ తేదీ రాత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు.