రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు. చుట్టుగుంటలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే మిర్చి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మిర్చి యార్డ్‌లో ధరలు పతనమవకుండా ఉండే విధంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు, నియమాలు, విధివిధానాలపై మంత్రి సమగ్రంగా సమీక్షించనున్నారు.