ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ యువతకు కీలక సందేశాన్నిచ్చింది. "ఎప్పుడూ కలలు కనడం ఆపకండి. అవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తాయో తెలియదు," అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె చెప్పింది.కలలు కనడం ఆపకుండా, అనుకున్నది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందని ఆలోచించకుండా, జరుగుతుందని మాత్రమే అనుకోవాలి అని హర్మన్‌ప్రీత్ కౌర్ ఉద్ఘాటించింది. బాల్యం నుండీ క్రికెట్ ఆడిన ఆమె, ప్రపంచకప్ గెలవడం తన కల అని పేర్కొంది.