ప్రత్యేకంగా

ప్రత్యేకంగా గుర్తుండిపోయే విజయం

Published on: 05-11-2025

దీపావళి పండుగకి అందరికీ వినోదం అందించాలనే లక్ష్యంతో 'కె-రేయాన్' చేశాం. ఆ సంకల్పం నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. కె-రేయాన్ విజయోత్సవ కార్యక్రమాన్ని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత రాజేష్ దండా, ప్రేక్షకులకు బ్లాక్‌బస్టర్ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. నాకు భవిష్యత్తులో ఇంకా పెద్ద విజయాలు రావొచ్చు గానీ ఈ 'కె-రేయాన్' విజయం ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.

Sponsored