వేగంగా

వేగంగా శాసనమండలి భవన పునర్నిర్మాణ పనులు

Published on: 05-11-2025

తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో చేపట్టిన శాసనమండలి భవన పునర్నిర్మాణ పనులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే భవన ప్రారంభోత్సవం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే సమావేశాలు ఈ భవనంలోనే నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుత్తా తెలిపారు. ఇప్పటివరకు జరిగిన పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, పనుల వేగం పెంచి, త్వరగా భవనాన్ని పూర్తిచేసి మండలి అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. పనుల పురోగతిని శాసనసభ కార్యదర్శి, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.

Sponsored