సలామ్

సలామ్ సైనికా..!

Published on: 05-11-2025

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన విశ్రాంత జవాన్ గుండాపులి మోహనరావు, 51 ఏళ్లుగా నిత్యం సైకిల్‌పై తిరుగుతూ సైన్యం గొప్పతనాన్ని వివరిస్తున్నారు. 1963 నుండి 1974 వరకు సైన్యంలో పనిచేసి, నాయక్ హోదాలో రిటైర్ అయ్యారు. సైన్యం నుండి విరమణ పొందిన తర్వాత, తెనాలిలో విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘాన్ని ఆయన స్థాపించారు. ప్రస్తుతం 88 ఏళ్ల వయస్సులోనూ, ఆయన రోజుకు 6 కిలోమీటర్లు సైకిల్‌పై తిరుగుతూ, సైనిక దుస్తులు ధరించి, జాతీయ జెండాను పట్టుకుని ప్రజలను పలకరిస్తారు. యువతకు సైన్యం గొప్పతనం, క్రమశిక్షణ గురించి చెబుతానని మోహనరావు పేర్కొన్నారు.

Sponsored