టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేశ్ మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి 70కి పైగా ప్రాంతాల ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. లోకేశ్ మధ్యాహ్నం 1:30 వరకు నాలుగు గంటలపాటు సుమారు 4 వేల మంది నుంచి వినతులు స్వీకరించారు. వైసీపీ పాలనలో అక్రమ కేసులు, భూ ఆక్రమణలు, ఉద్యోగ తొలగింపులు, పోలీసుల వేధింపులపై బాధితులు ఆయనకు ఫిర్యాదు చేశారు. అందించిన వినతులపై అక్కడికక్కడే లోకేశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ అండగా ఉంటుందని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు.