ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలోది. ఇది గ్రాండ్ కెనాన్‌గా పేరుపొందిన లోయ. దక్షిణాయనం కాలంలో ఈ లోయ ప్రాంతం బంగారు వర్ణంలో వెలుగొందుతుంది. సూర్యుడు పడమటి గూటికి చేరుకునే సమయంలో, ఆ కిరణాలు పాలకొండల మీదుగా పెన్నా నదిలో ప్రతిబింబిస్తాయి. ఈ మనోహరమైన దృశ్యాలను తిలకించేందుకు దేశం నలుమూలల నుండీ పకృతి ప్రేమికులు గండికోటకు తరలివస్తుంటారు. చిత్రంలో గండికోటలోని జామా మసీదు సమీపం నుంచి కనిపించే సౌందర్యం ఉంది.