ప్రపంచవ్యాప్తంగా డిక్ చెనీగా ప్రసిద్ధి చెందిన అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు రిచర్డ్ బ్రూస్ చెనీ (84), అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీర్ఘకాలంగా బాధిస్తున్న గుండె సమస్యలకు న్యుమోనియా తోడవటంతో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం జాతికి తీరని లోటని, ఆయన స్నేహితులకు విషాదాన్ని మిగిల్చిందని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ అన్నారు. 9/11 దాడుల అనంతరం ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌లపై అమెరికా చేపట్టిన తీవ్ర యుద్ధాలకు నిర్దిష్టాగా ప్రసిద్ధి పొందిన డిక్ చెనీ, 2001 నుంచి 2009 వరకు బుష్ హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు