టిప్పర్

టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడంతోనే ప్రమాదం..! : మంత్రి పొన్నం

Published on: 03-11-2025

రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం మీర్జాగాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. టిప్పర్ రాంగ్‌రూట్‌లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు మంత్రికి తెలిపారు. బస్సు కంకర లోడుతో వస్తున్న లారీని ఢీకొట్టి, కంకర లోడు కింద పడిపోవడంతో 20 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.

Sponsored