రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, అధికారులకు తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సానుభూతి తెలిపారు.